రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక వర్సిటీకి యూజీసీ గుర్తింపు
ABN , First Publish Date - 2020-06-18T14:58:49+05:30 IST
విజయవాడ: రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వ విద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది.
విజయవాడ: రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వ విద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి 12బి గుర్తింపు పొందినట్టుగా ఛాన్సలర్ ఆచార్య కేసి.రెడ్డి తెలిపారు. 2008లో స్థాపించిన ట్రిపుల్ ఐటీలకు 12ఏళ్ళ తరువాత యూజీసీ గుర్తింపు లభించింది. యూజీసీ గుర్తింపు ద్వారా ట్రిపుల్ ఐటీలకు ఆర్థిక సహకారం చేకూరనుంది. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా మరిన్ని సదుపాయాలు అందనున్నాయి.