మా పొలంలో ‘ఆర్బీకే’ వద్దు

ABN , First Publish Date - 2020-12-10T09:41:33+05:30 IST

రెవిన్యూ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తమ భూములు లాక్కొంటున్నారని పేర్కొం టూ మహి ళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం

మా పొలంలో ‘ఆర్బీకే’ వద్దు

వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతారా?

అధికారుల తీరును నిరసిస్తూ 

మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

కుప్పం నియోజకవర్గంలో కలకలం


రామకుప్పం, డిసెంబరు 9: రెవిన్యూ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తమ భూములు లాక్కొంటున్నారని పేర్కొం టూ మహి ళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లెకు చెందిన వెంకట్రామెగౌడ భార్య ఆరతి పేరిట 2013లో 2.5 ఎకరాల భూమికి అధికారులు డీకేటీ పట్టా ఇచ్చారు. ఆరతి కుటుంబం ఆ భూముల్లో సేద్యం చేస్తోంది. అయితే, రాజుపేట, బైపరెడ్లపల్లె పం చాయతీలకు కలిపి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే), ఆరో గ్య కేంద్రం, సచివాలయ భవనాలను మంజూరు చేసింది. నిర్మా ణంపై 2 పంచాయతీల వైసీపీ నేతల మద్య విభేదాలు వచ్చాయి. దీంతో వైసీపీ కుప్పం ఇన్‌చార్జి భరత్‌ రామకుప్పం చేరుకుని రాజుపేటలో వాటిని నిర్మించుకునేలా ఒప్పించారు. ఈ క్రమంలో ఆరతి పేరిట గల డీకేటీ పట్టాను రద్దు చేయించారు. ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు బుధవారం తహసీల్దారు శ్రీనివాసు లు భూముల సర్వేకి వెళ్లగా ఆరతి కుటుంబసభ్యులు రూ.లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసిన భూములు లాక్కోవద్దని వేడుకున్నారు. కోర్టు స్టే ఇచ్చిందని వివరించారు.


భూములు లాక్కుంటే ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దారు ‘‘ఆత్యహత్య చేసుకుంటే చేసుకోండి’’ అనడంతో ఆరతి వారి ఎదుటే పురుగులమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కుప్పం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వారు తెలిపారు. ఈ విషయమై తహసీల్దారును వివరణ కోరగా.. ఆరతి పేరిట ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు చెల్లవని తెలిపారు. ఆరతి పురుగుల మందు డబ్బాలో నీరు పోసుకుని తాగి బెదిరించిందన్నారు. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

Updated Date - 2020-12-10T09:41:33+05:30 IST