సీఎంను కలిసే అవకాశం లేక పోవడంతో.. వైఎస్ విగ్రహానికి..

ABN , First Publish Date - 2020-07-18T17:42:20+05:30 IST

పెండింగ్ కమిషన్, ఇన్సూరెన్స్ కల్పించాలంటూ రేషన్ డీలర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎంను కలిసే అవకాశం లేక పోవడంతో.. వైఎస్ విగ్రహానికి..

విజయవాడ: పెండింగ్ కమిషన్, ఇన్సూరెన్స్ కల్పించాలంటూ రేషన్ డీలర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చారని మండాది వెంకట్రావు ఎపి రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు చెప్పారు. ఏడు విడతలుగా ప్రజలకు రేషన్ అందించినా.. రెండు విడతలకు మాత్రమే కమిషన్ ఇచ్చారన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు రేషన్ అందించామని చెప్పారు. కరోనాతో నలుగురు డీలర్లు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు ఆస్పత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. కరోనా వారియర్స్‌గా గుర్తించి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులను కలిసి విన్నవించినా స్పందన లేదన్నారు. సీఎంను కలిసే అవకాశం లేక పోవడంతో.. వైఎస్ విగ్రహానికి వినతి పత్రాలు అందించామన్నారు. మేము కరోనాతో చనిపోతే...తమ కుటుంబాలకు దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్పందించి తమ సమస్యలు పరిష్కారించాలన్నారు. 

Updated Date - 2020-07-18T17:42:20+05:30 IST