భూముల రీసర్వేకు సెటిల్‌మెంట్ వ్యవస్థ: బొప్పరాజు
ABN , First Publish Date - 2020-12-13T08:58:34+05:30 IST
భూముల రీసర్వేకు సెటిల్‌మెంట్ వ్యవస్థ: బొప్పరాజు

విశాఖపట్నం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వే సమయంలో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో సెటిల్‌మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని సూచించారు. అప్పటివరకు భూముల రీసర్వేను వాయిదా వేయాలని సీఎం జగన్‌కు కోరారు. విశాఖలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సెటిల్‌మెంట్ కోసం డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి సరిపోరని, మండలానికి ఒక సీనియర్ తహసీల్దార్, అసెంబ్లీ నియోజకవర్గానికొక డిప్యూటీ కలెక్టర్‌ను అప్పిలేట్ అధికారిగా నియమించాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చేతులెత్తి మొక్కుతున్నానన్నారు.