పదోన్నతులు కల్పించండి

ABN , First Publish Date - 2020-11-06T09:23:04+05:30 IST

రిజిస్ర్టేషన్ల శాఖలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదా్‌సకు ఏపీ సబ్‌ రిజిస్ర్టార్ల

పదోన్నతులు కల్పించండి

మంత్రికి సబ్‌ రిజిస్ర్టార్ల సంఘం వినతి


అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రిజిస్ర్టేషన్ల శాఖలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదా్‌సకు ఏపీ సబ్‌ రిజిస్ర్టార్ల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.గోపాల్‌, కోశాధికారి ఎ.ఆనంద్‌కుమార్‌ గురువారం ఇక్కడ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏసీబీ దాడులు జరిగిన వెంటనే సబ్‌ రిజిస్ర్టార్లను బదిలీ చేయడం తగదన్నారు. ఏసీబీ పేర్కొన్న అంశాలు రుజువైనప్పుడు బదిలీతో పాటు, ఇతర చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-06T09:23:04+05:30 IST