‘రాజ్యాంగం పిచ్చివాళ్ల చేతిలో పడితే ఇలాగే మారుతుంది’

ABN , First Publish Date - 2020-12-17T18:05:28+05:30 IST

ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారని...

‘రాజ్యాంగం పిచ్చివాళ్ల చేతిలో పడితే ఇలాగే మారుతుంది’

అమరావతి: ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత తీవ్ర స్థాయిలో విమర్శించారు. అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఇది అమరావతి రైతులకే కాదని, భారత రాజ్యాంగానికి.. ఒక తుగ్గక్‌కు జరుగుతున్న పోరాటమని అన్నారు. జగన్‌కు భారత రాజ్యాంగంపట్ల ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. భారత రాజ్యాంగం మంచి వాళ్ల చేతిలో ఉంటే మంచిగా ఉంటుందని, అదే పిచ్చివాళ్లు, చెడ్డవాళ్ల చేతిలో ఉంటే చెడు రాజ్యంగంగా మారుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారన్నారు. జగన్ ప్రభుత్వం భారత రాజ్యంగ హక్కుల్ని కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా రైతుల పోరాటం, వారి త్యాగం వృధాగా పోదని.. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతవరకు రైతుల పోరాటం కొనసాగుతుందని, వారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతుగా ఉంటుందన్నారు.

Updated Date - 2020-12-17T18:05:28+05:30 IST