పార్ట్‌టైమ్‌ అధ్యాపకుల సర్వీసు రెన్యువల్‌

ABN , First Publish Date - 2020-11-27T09:17:56+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని 52 మంది పార్ట్‌టైమ్‌ అధ్యాపకుల సర్వీసులను రెన్యువల్‌ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

పార్ట్‌టైమ్‌ అధ్యాపకుల సర్వీసు రెన్యువల్‌

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని 52 మంది పార్ట్‌టైమ్‌ అధ్యాపకుల సర్వీసులను రెన్యువల్‌ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీచేశారు. వీరిని 2020-21లో 10రోజుల బ్రేక్‌తో 12నెలలు పనిచేసేలా రెన్యువల్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


పీఆర్‌ కమిషనరేట్‌లో ఉద్యోగుల ప్రతిజ్ఞ

రాజ్యాంగం ఆమోదం పొంది 71ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌లో అధికారులు, ఉద్యోగులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. 


జేఎండీకి పొడిగింపు

ట్రాన్స్‌కో విజిలెన్స్‌, సెక్యూరిటీ విభాగానికి జాయింట్‌ ఎండీగా వ్యవహరిస్తున్న కె. వెంకటేశ్వరరావుకు మరో ఏడాది పొడిగింపు లభించింది. పదవీ విరమణ తర్వాత ఆయన ఈ పదవిలో నియమితులయ్యారు.

Read more