ఏపీ‘సీఎం రిలీఫ్ ఫండ్’కు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన రిలయన్స్

ABN , First Publish Date - 2020-04-15T03:23:53+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ .5 కోట్ల ఆర్థిక సాయం అందించింది.

ఏపీ‘సీఎం రిలీఫ్ ఫండ్’కు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన రిలయన్స్

అమరావతి: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ .5 కోట్ల ఆర్థిక సాయం అందించింది. కోవిడ్ -19కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపుపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయడంతోపాటు పీఎం-కేర్స్ సహాయ నిధికి రిలయన్స్ ఇప్పటికే రూ. ​​530 కోట్లకుపైగా ఆర్థిక సాయం చేసింది. తొలి దశ లాక్‌డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించారని, కరోనా కేసులు పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 3వరకు పొడిగించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మోదీ ప్రకటన చేశారు. 19 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-04-15T03:23:53+05:30 IST