బిల్లును తిరస్కరించండి
ABN , First Publish Date - 2020-07-19T09:10:00+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పంపిన మూడు రాజధానుల బిల్లును ఆమోదించకుండా తిరస్కరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్

గవర్నర్‌ను అభ్యర్థించిన శైలజానాథ్
అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పంపిన మూడు రాజధానుల బిల్లును ఆమోదించకుండా తిరస్కరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అభ్యర్థించారు. ఈ మేరకు శనివారం ఆయన గవర్నర్ బిశ్వభూషణ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. ఇది ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోబావాలకు సంబంధించిన అంశమని గవర్నర్ దృష్టికి పీసీసీ అధ్యక్షుడు తీసుకువచ్చారు.