గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు: మంత్రి కృష్ణదాస్
ABN , First Publish Date - 2020-12-12T01:56:22+05:30 IST
గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు: మంత్రి కృష్ణదాస్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూములను రీ సర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి భూముల రీ సర్వే ప్రారంభమవుతుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
భూముల రీ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. 17,466 గ్రామాల్లో భూముల రీ-సర్వే జరగబోతోందని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, కొత్త జిల్లాల ప్రకటన చేసేందుకు ఇంకా సమయం ఉందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.