ఏబీవీపై అభియోగాల నమోదు

ABN , First Publish Date - 2020-12-19T08:04:46+05:30 IST

నిఘా పరికరాల కొనుగోలు కేసులో రాష్ట్ర నిఘా విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్రప్రభుత్వం అభియోగాలు (ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌) నమోదు

ఏబీవీపై అభియోగాల నమోదు

15 రోజుల్లో బదులివ్వాలని ప్రభుత్వ ఆదేశం 


అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నిఘా పరికరాల కొనుగోలు కేసులో రాష్ట్ర నిఘా విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్రప్రభుత్వం అభియోగాలు (ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌) నమోదు చేసింది. ఈ మేరకు శుక్రవారం సీఎస్‌ నీలం సాహ్ని జీవో జారీ చేశారు. అభియోగాలపై 15 రోజుల్లోగా వెంకటేశ్వరరావు వివరణ ఇవ్వాలన్నారు. ఏబీవీ నిఘా అధిపతిగా ఉన్నప్పుడు.. 2017-18లో ఏరోస్టాట్‌-యూఏవీ టెక్నాలజీతో కూడిన నిఘా పరికరాలను సమకూర్చుకునేందుకు పోలీసు శాఖ నిర్వహించిన టెండర్లు, కంపెనీల ఎంపికలో అవకతవకలు జరిగాయని..


నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ వైసీపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది. దానిని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ సమర్థించింది. అయితే ఆ సస్పెన్షన్‌ ఉత్తర్వులను హైకోర్టు రద్దుచేసి.. తక్షణమే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గత నెల 26న స్టే విధించింది. సస్పెన్షన్‌కు అనుమతించిన సమయంలో ఆయనకు చార్జి మెమో ఎందుకివ్వలేదని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Read more