కోలుకున్న తిరుమల అర్చకులు

ABN , First Publish Date - 2020-07-28T09:19:30+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహిస్తూ కరోనా బారిన పడిన అర్చకులు కోలుకున్నారు. మొత్తం 17 మంది

కోలుకున్న తిరుమల అర్చకులు

  • ఆస్పత్రి నుంచి 16 మంది డిశ్చార్జి
  • 30 వరకు హోం క్వారంటైన్‌

తిరుమల, జూలై 27(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహిస్తూ కరోనా బారిన పడిన అర్చకులు కోలుకున్నారు. మొత్తం 17 మంది అర్చకులకు వైరస్‌ సోకింది. వీరిలో ఓ సీనియర్‌ అర్చకుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మిగిలిన 16 మంది తిరుపతిలోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. వీరికి తాజాగా కరోనా పరీక్షల్లో నెగెటివ్‌  రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈనెల 30 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని  వైద్యులు సూచించారు. ఆ తర్వాత వారు విధులకు హాజరుకానున్నట్టు ఓ ప్రధాన అర్చకుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2020-07-28T09:19:30+05:30 IST