చంద్రబాబు చేసిందే నిజమైన అభివృద్ధి: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2020-07-21T01:43:01+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధాని అమరావతిపైనే ప్రేమెక్కువని వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెబుతున్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని

చంద్రబాబు చేసిందే నిజమైన అభివృద్ధి: అశోక్‌బాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధాని అమరావతిపైనే ప్రేమెక్కువని వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెబుతున్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని, పులివెందులకు నీళ్లిచ్చారని, చిత్తూరులో శ్రీసిటీ, అనంతపురంలో కియా పరిశ్రమ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వచ్చాయని గుర్తుచేశారు. చంద్రబాబు చేసిందే నిజమైన అభివృద్ధి అని ఆయన చెప్పారు. 151 సీట్లు రావడం అధికారానికి మాత్రమేనని, అది శాశ్వతం కావడానికి కాదన్నారు. మూడురాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీ ముందున్నాయని ప్రభుత్వమే హైకోర్టులో ఒప్పుకుందని తెలిపారు. ఇప్పుడేమో సెలెక్ట్ కమిటీ లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మండలి కార్యదర్శిని భయపెట్టి,  ఛైర్మన్ నిర్ణయం అమలుకాకుండా అడ్డుకుంది మీరు కాదా అని అశోక్‌బాబు నిలదీశారు.

Updated Date - 2020-07-21T01:43:01+05:30 IST