రేషన్‌ పంపిణీలో విశాఖకు ప్రథమ స్థానం

ABN , First Publish Date - 2020-04-18T12:03:45+05:30 IST

రేషన్‌ పంపిణీలో విశాఖకు ప్రథమ స్థానం

రేషన్‌ పంపిణీలో విశాఖకు ప్రథమ స్థానం

విశాఖపట్నం: తెల్ల కార్డుదారులకు  ఉచితంగా బియ్యం, శనగలు పంపిణీలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. శుక్రవారం పంపిణీ చేయాల్సిన బియ్యం, శనగలు  ఉదయం ఏడు గంటలలోపే 98 శాతం కార్డుదారులకు  అందజేశారు. తొలిరోజు గురువారం సర్వర్‌ మొరాయింపుతో సరకుల పంపిణీలో ఇబ్బందులు వచ్చాయి. దీంతో సర్వర్‌తో నిమిత్తం లేకుండా ఆఫ్‌లైన్‌లో ఇవ్వాలని ఆదేశాలతో డీలర్లు, ప్రభుత్వ సిబ్బంది పంపిణీ చేశారు. శుక్రవారం జిల్లాలో మొత్తం 4554 డిపోలు/ కౌంటర్లు/ డోర్‌ డెలివరీ ద్వారా 2,11,815 మందికి సరకులు అందజేశారు. అధికారులు, సిబ్బంది, డీలర్లను జేసీ శివశంకర్‌ అభినందించారు.

Updated Date - 2020-04-18T12:03:45+05:30 IST