ఇంటి ముందే కాటా!

ABN , First Publish Date - 2020-05-09T09:33:07+05:30 IST

రేషన్‌ డోర్‌ డెలివరీ విధానంలో ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురానుంది. ఇంతకాలం సంచుల్లో బియ్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాని స్థానంలో ఇంటి ముందే తూకం ..

ఇంటి ముందే  కాటా!

రేషన్‌ డోర్‌ డెలివరీలో భారీ మార్పు

మొబైల్‌ వాహనాల ద్వారా పంపిణీ

ఒక కుటుంబానికి ఒకసారే సంచులు

ప్రతి నెలా వాటిలోనే బియ్యం

సెప్టెంబరు నుంచి అమల్లోకి విధానం

సంచులు తిరిగి ఇవ్వండి

రేషన్‌ డీలర్లపై అధికారుల ఒత్తిడి


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రేషన్‌ డోర్‌ డెలివరీ విధానంలో ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురానుంది. ఇంతకాలం సంచుల్లో బియ్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాని స్థానంలో ఇంటి ముందే తూకం వేసి ఇచ్చే విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇక నుంచి 5, 10, 20 కిలోల సంచులు ఉండవు. వాటికి బదులుగా కాటా ఉండే వాహనాన్ని లబ్ధిదారుల ఇళ్ల ముందుకు తీసుకెళ్లి తూకం వేసి అక్కడే బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేస్తారు. సెప్టెంబరు నుంచి ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని శుక్రవారం సీఎం వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం 13,370 ట్రాలీలను కొనుగోలు చేసి గ్రామ, వార్డు సచివాలయాలకు ఇస్తారు.


ఆ ట్రాలీల్లోనే బియ్యంతో పాటు కాటా ఉంటుంది. దీనికి ముందు కార్డుదారులకు బియ్యం పోయించుకోడానికి ఇంటికి ఒకటి లేదా రెండు చొప్పున సంచులు ఉచితంగా ఇస్తారు. ప్రతి నె లా సంచుల్లో సరఫరా చేసే విధానం కాకుండా ఒకేసారి చే తి సంచితో బియ్యం తీసుకునే విధానం వచ్చింది. ఈ విధా నం పాత విధానం కంటే తక్కువ ఖర్చులో అయిపోతుందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాల్లో చేపట్టిన డోర్‌ డె లివరీ విధానం అనుభవాల దృష్ట్యా ఈ నూతన విధానం తీ సుకొచ్చామని పౌరసరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌ చెప్పా రు. గోదాముల నుంచి వచ్చే ప్రతి గోనె సంచిపై స్ర్టిప్‌ సీల్‌, బార్‌ కోడ్‌ ఉంటుందని దాన్ని తెరిచి కల్తీ చేయడం సాధ్యం కాదని వివరించారు. కాగా, నూతన విధానంతో రేషన్‌ డీలర్లలో ఆందోళన మొదలైంది. తాజా విధానంతో పూర్తిగా పనిలేకుండా పోతుందని అంటున్నారు. 


సంచులు తిరిగి ఇవ్వండి

రేషన్‌ సరుకుల సరఫరాకు సంబంధించి వినియోగించిన సంచులను తిరిగి ఇవ్వాలని పౌరసరఫరాల అధికారులు రేష న్‌ డీలర్లను కోరారు. తాము నిర్ణయించిన ధర చెల్లిస్తామని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ నిర్ణయం డీలర్లు, అధికారులకు మధ్య వివాదానికి దారితీస్తోంది. సాధారణంగా రేషన్‌ సరుకులు తరలించేందుకు 50 కిలోల సామర్థ్యం ఉన్న గోనె సంచులను వినియోగిస్తారు. వీటిని డీలర్లకే వదిలేస్తా రు. డీలర్లకు కమీషన్‌ కాకుండా సంచుల రూపంలో కొంత ఆదాయం చేకూరుతుంది. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా పశ్చి మ బెంగాల్‌ నుంచి రావాల్సిన గోనె సంచులు ఆగిపోయా యి. దీంతో డీలర్లకు గతంలో ఇచ్చినవే తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఒక్కో సంచిని రూ. 25కు అమ్ముకోవాలని డీలర్లు భావించారు. అయితే, అధి కారులు మాత్రం సంచీకి రూ.15, రూ.16, రూ.18 చొప్పున వెల నిర్ణయించారు.  


లీగల్‌ మెట్రాలజీలో పదోన్నతులు

లీగల్‌ మెట్రాలజీలో పలువురు అధికారులకు పదోన్నతులు కల్పించారు. కర్నూలు డిప్యూటీ కంట్రోలర్‌గా ఉన్న గో పి కృష్ణారెడ్డికి జాయింట్‌ కంట్రోలర్‌గా పదోన్నతి కల్పించారు. విజయవాడలో పనిచేస్తున్న డిప్యూటీ కంట్రోలర్‌ రాజే్‌షకుమార్‌కు జాయింట్‌ కంట్రోలర్‌గా పదోన్నతి కల్పించి, విశాఖ కు బదిలీ చేశారు. 

Updated Date - 2020-05-09T09:33:07+05:30 IST