తిరుమల ఘాట్ రోడ్‌లో అరుదైన దేవాంగుల పిల్లి పిల్లలు
ABN , First Publish Date - 2020-05-24T05:30:00+05:30 IST
తిరుమల ఘాట్ రోడ్‌లో అరుదైన వన్యప్రాణుల సందడి కనిపిస్తోంది.

తిరుమల: ఘాట్ రోడ్‌లో అరుదైన వన్యప్రాణుల సందడి కనిపిస్తోంది. లాక్ డౌన్ వల్ల జనసంచారం లేకపోవడంతో మూగజీవాలు రోడ్డుపైకి వస్తున్నాయి. పిల్లుల్లోనే అరుదైన జాతి అయిన దేవాంగుల పిల్లి పిల్లలు రెండవ ఘాట్ రోడ్‌లో తిరుగుతుండడాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. జంట దేవంగ్ పిల్లులను సిబ్బంది పట్టుకుని తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేశారు. మళ్లీ అవి రోడ్డుపైకి వస్తే వాటిని తిరుపతిలోని జూ పార్క్‌కు తరలిస్తామని అధికారులు తెలిపారు.