వైసీపీ నేతల ఫోన్ కాల్ వైరల్

ABN , First Publish Date - 2020-09-21T01:43:59+05:30 IST

వైసీపీ నేతల ఫోన్ కాల్ వైరల్

వైసీపీ నేతల ఫోన్ కాల్ వైరల్

అనంతపురం: వైసీపీ నేతల ఫోన్‌కాల్‌ సంభాషణ వైరల్‌ అయింది. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, పెనుకొండ వైసీపీ నేత రమణారెడ్డి ఫోన్‌కాల్‌ లీక్‌ అయింది. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, పెనుకొండ వైసీపీ అసమ్మతి నేత గంపల రమణారెడ్డి ఫోన్‌కాల్‌ వైరల్‌ అయింది. ‘‘మనం లోకల్, మంత్రి శంకర్‌నారాయణ లోకల్ కాదు. వైసీపీలో ఈ రోజు ఉండొచ్చు.. పోవచ్చు.. ఉంటాడో లేదో కూడా తెలియదు. మనం శాశ్వతంగా పార్టీలో ఉంటాం, మన చెట్టును మనం నరుక్కోవడం ఏంటి?. నా దగ్గరకు రొద్దం, సోమందేపల్లి, గోరంట్ల మండలాలకు చెందిన కార్యకర్తలు వచ్చి బాధను వెళ్ళగక్కుతారు. పార్టీ మనది.. మంత్రి శంకర్‌నారాయణ బాడుగ ఇంట్లోకి వచ్చాడు. మనతో బాగుంటే శాశ్వతంగా ఉంటాడు. ఎవరు ఏం చేసుకున్నా గంపల రమణారెడ్డికి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఉన్నాడు. జగన్‌ ఏం నిర్ణయం తీసుకున్నా మీ అందరిని వెనకేసుకుంటా. పెనుకొండ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా పని చేశా, పార్టీ హైకమాండ్‌తో మాట్లాడుతా.’’ అని గంపల రమణారెడ్డితో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ఈ అంశం వైసీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-09-21T01:43:59+05:30 IST