మైనర్ బాలికను అత్యాచారం చేయటం అమానుషం: వాసిరెడ్డి పద్మ

ABN , First Publish Date - 2020-07-19T23:16:32+05:30 IST

మైనర్ బాలికను అత్యాచారం చేయటం అమానుషం: వాసిరెడ్డి పద్మ

మైనర్ బాలికను అత్యాచారం చేయటం అమానుషం:  వాసిరెడ్డి పద్మ

రాజమండ్రి: పదోతరగతి చదివిన 16 ఏళ్ల  మైనర్ బాలికను ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి ఒక బ్యాచ్ గా అత్యాచారం చేయటం అమానుషమని ఏపీ మహిళ కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.అమ్మాయిల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని దురాగతాలకు పాల్పడటం దురదృష్టకరమని ఆమె తెలిపారు. అత్యాచారంపై కేసు నమోదులో  పోలీసుల నిర్లక్ష్యంపై కూడా లోతుగా విచారణ చేపడతామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని సహించమన్నారు. బాధిత బాలికను ఆస్పత్రికి కుటుంబ సభ్యులే తీసుకెళ్లడం, పోలీసులు సహకరించకపోవటం క్షమించరాని నేరమని ఆమె అన్నారు. బ్యాచ్ లుగా ఏర్పడి అమ్మాయిలను ట్రాప్ చేసే వారిని చట్టపరంగా తీవ్రంగా శిక్ష పడేలా చేస్తామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. దిశ చట్టం కింద నిందితులకు 21 రోజుల్లో శిక్ష పడేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పద్మ చెప్పారు. బాధిత బాలిక కుటుంబానికి నిందితులు నుంచి ప్రాణహాని ఉంటే మహిళా కమిషన్ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులతో మాట్లాడి బాలిక కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తామని ఏపీ మహిళ కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి వెల్లడించారు.

Updated Date - 2020-07-19T23:16:32+05:30 IST