మంత్రికొడాలి నానిని కలిసిన జనసేన ఎమ్మెల్యే: రాపాక వరప్రసాద్

ABN , First Publish Date - 2020-11-06T19:02:31+05:30 IST

విజయవాడ: మంత్రి కొడాలి నానిని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ పాలన అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉందని ప్రశంసించారు.

మంత్రికొడాలి నానిని కలిసిన జనసేన ఎమ్మెల్యే: రాపాక వరప్రసాద్

విజయవాడ: మంత్రి కొడాలి నానిని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ పాలన అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉందని ప్రశంసించారు. టీడీపీకి అనుకూలంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉంటున్నారన్నారు. కరోనాను అడ్డు పెట్టుకుని నాడు స్థానిక ఎన్నికలను ఆపారని రాపాక వరప్రసాద్ విమర్శించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇప్పుడు ఎన్నికలు జరుపుతామంటే కోర్టులు ఒప్పుకోవన్నారు. నిమ్మగడ్డ వ్యవహారంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు.


Updated Date - 2020-11-06T19:02:31+05:30 IST