జగన్ కక్షపూరితంగా రమేష్‌కుమార్‌ను తొలగించారు: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-05-29T20:53:03+05:30 IST
సీఎం జగన్ కక్షపూరితంగా రమేష్‌కుమార్‌ను తొలగించారని, కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేయడమే నిమ్మగడ్డ చేసిన తప్పా? అని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు.

విశాఖ: సీఎం జగన్ కక్షపూరితంగా రమేష్‌కుమార్‌ను తొలగించారని, కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేయడమే నిమ్మగడ్డ చేసిన తప్పా? అని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలోనే ఇంత క్రూరంగా, హీనంగా ఎన్నికల ప్రక్రియ జరగలేదని, ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని రామకృష్ణ కోరారు,