పరారీలో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ

ABN , First Publish Date - 2020-08-12T09:23:14+05:30 IST

విజయవాడ స్వర్ణప్యాలె్‌సలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పి.రమేశ్‌బాబు పరారీలో ఉన్నారని

పరారీలో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ

  • గాలింపునకు ప్రత్యేక బృందాలు
  • ముగ్గురు నిందితులకు రిమాండ్‌

విజయవాడ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): విజయవాడ స్వర్ణప్యాలె్‌సలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పి.రమేశ్‌బాబు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మూడు వాక్యాలతో కూడిన ప్రకటనను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం డాక్టర్‌ రమేశ్‌ పరారీలో ఉన్నారని, గాలింపునకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు ఈ నెల 21 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.  

Updated Date - 2020-08-12T09:23:14+05:30 IST