సాగునీటి వినియోగంపై కేసీఆర్ వైఖరి సరికాదు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-08-11T14:44:47+05:30 IST

సాగునీటి వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

సాగునీటి వినియోగంపై కేసీఆర్ వైఖరి సరికాదు: రామకృష్ణ

విజయవాడ: సాగునీటి వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు జల వివాదాలకు తావిస్తూ అఫెక్స్ కౌన్సిల్‌కు వెళ్లారన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు కేసీఆర్‌లు రాజకీయంగా, వ్యక్తిగతంగా సహకరించుకుంటూ విందులు చేసుకుంటూ.. ప్రజా సమస్యలపట్ల వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయపూర్వక వాతావరణంలో చర్చించుకోవాలని రామకృష్ణ సూచించారు.

Updated Date - 2020-08-11T14:44:47+05:30 IST