ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-06-19T18:37:25+05:30 IST

అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీలు, అమరావతి రాజధాని సాధన కోసం ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది: రామకృష్ణ

అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీలు, అమరావతి రాజధాని సాధన కోసం ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ, అమరావతి పరిరక్షణ అధ్యక్షుడు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు.


శాసనమండలి సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపితే దానినే రద్దు చేశారన్నారు. రాజధాని ఉద్యమం శాంతియుతంగా చేస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించారన్నారు. మంత్రులు కూడా శాసనమండలి రౌడీలు లాగా ప్రవర్తిస్తున్నారన్నారు. అధికారంలో లేనప్పుడు ఒకలాగా వచ్చాక ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-19T18:37:25+05:30 IST