-
-
Home » Andhra Pradesh » Ramakrishna comments
-
వేరుశనగ రైతులను ఆదుకోవాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-12-15T15:32:30+05:30 IST
వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

విజయవాడ: వేరుశనగ రైతులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర నేతలు రావుల వెంకయ్య, పి.రామచంద్రయ్య తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలో పది లక్షల ఎకరాలకు పైగా వేరుశనగ పంట నష్టం జరిగిందన్నారు. వేరుశనగ రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.