రైతుల తరపున పోరాటం చేయాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-12-07T21:40:37+05:30 IST

పు జరిగే భారత్ బంద్‌లో దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలు పాల్గొంటున్నాయని.. కాని ఏపీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు రైతుల తరపున పోరాటం చేయడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.

రైతుల తరపున పోరాటం చేయాలి: రామకృష్ణ

ప్రకాశం: దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన  రాజకీయ పార్టీలు రేపు జరిగే భారత్ బంద్‌లో పాల్గొంటున్నాయని.. కాని  ఏపీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం రైతుల తరపున పోరాటం చేయడం లేదని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  వ్యాఖ్యానించారు.  రైతు ఉద్యమంలో పాల్గొనకపోతే సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు రైతు ద్రోహులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని,  రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదని మండిపడ్డారు.  ప్రభుత్వం వెంటనే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.  ఏలూరు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని.. దీంతోనే బాధితుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందన్నారు. ఏలూరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని లేకపోతే వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. 

Updated Date - 2020-12-07T21:40:37+05:30 IST