తనకు వైద్యం జరగడం లేదని డాక్టర్ సుధాకర్ లేఖ రాశారు: రామకృష్ణబాబు
ABN , First Publish Date - 2020-05-29T20:06:59+05:30 IST
విశాఖపట్నం: డాక్టర్ సుధాకర్ తనకు వైద్యం జరగడం లేదని లేఖ రాశారని టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు

విశాఖపట్నం: డాక్టర్ సుధాకర్ తనకు వైద్యం జరగడం లేదని లేఖ రాశారని టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. డాక్టర్ రామిరెడ్డి వలన తన కుమారుడికి ఇబ్బంది ఉందని డాక్టర్ సుధాకర్ తల్లి అనితకు ఫోన్ చేసి తెలియజేశారని వెల్లడించారు. సుధాకర్‌కు మతిస్థిమితం లేదని అనడం చాలా విడ్డురంగా ఉందన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని తనకు ఆయనే చెప్పారని రామకృష్ణబాబు పేర్కొన్నారు.