-
-
Home » Andhra Pradesh » Ramakrishna
-
‘టీచర్’ ఓటర్లకు కౌంటర్ సంతకమెందుకు?
ABN , First Publish Date - 2020-11-21T08:50:42+05:30 IST
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే.. ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు చెందిన ఉపాధ్యా య సిబ్బంది..

సీఈవో ఉత్తర్వు ఆంతర్యమేంటి?
ఈసీకి ఎమ్మెల్సీ రామకృష్ణ ఫిర్యాదు
న్యూఢిల్లీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే.. ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు చెందిన ఉపాధ్యా య సిబ్బంది.. నిర్దేశిత అధికారి నుంచి కౌంటర్ సంతకం తీసుకోవాలన్న నిబంఽధనను ఆకస్మికంగా ప్రవేశపెట్టడంపై గుంటూరు-కృష్ణా నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.ఎస్. రామకృష్ణ అభ్యంతరం తెలియజేశారు. ఓటరు దరఖా స్తు చేసుకోకముందు అలాంటి నిబంధన పెట్టకుండా.. దరఖాస్తు చేశాక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సర్క్యులర్ జారీ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ నిబంధనను మినహాయించి వారికి మళ్లీ ఓటు హక్కు పునరుద్ధరించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి వినతిపత్రం సమర్పించారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎయిడెడ్ ఉపాధ్యాయ సిబ్బందికి తమ సర్వీస్ సర్టిఫికెట్‌పై కౌంటర్ సం తకం తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదని.. సంబంధిత సంస్థ అధిపతి సంతకం ఉంటే సరిపోయేదని గుర్తు చేశారు. అలా ఓటర్ల జాబితాలో నమోదు చేసుకున్న వారందరి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని తెలిపారు.