‘రజనీ రాజకీయాల్లోకి వచ్చినా.. ఢోకా లేదు..’
ABN , First Publish Date - 2020-09-14T15:38:36+05:30 IST
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా, మరెవరైనా పార్టీని ప్రారంభించినా అన్నాడీఎంకేకు ఢోకా లేదని మంత్రి కడంబూర్ రాజు అన్నారు. వచ్చే యేడాది జరుగనున్న
చెన్నై(ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా, మరెవరైనా పార్టీని ప్రారంభించినా అన్నాడీఎంకేకు ఢోకా లేదని మంత్రి కడంబూర్ రాజు అన్నారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేని గెలిపించాలని రాష్ట్ర ప్రజలంతా సిద్ధమైపోయారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోవిల్‌పట్టి వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎన్నటికీ చెక్కుచెదరదని, రానున్న ఎన్నికల్లోనూ గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీట్‌ను రద్దు చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని, ఆ దిశగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నీట్ అమలు కావడానికి కాంగ్రెస్, డీఎంకే ప్రభుత్వాలు అనుసరించిన తప్పుడు విధానాలే కారణమన్నారు. నీట్‌కు విద్యార్థులు భయపడకూడదని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబీకులను శోకసముద్రంలోకి నెట్టకూడదని ఆయన కోరారు.