రాజాసింగ్‌.. నోరు అదుపులో పెట్టుకో..!

ABN , First Publish Date - 2020-12-27T08:34:34+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఘాటుగా స్పందించారు.

రాజాసింగ్‌.. నోరు అదుపులో పెట్టుకో..!

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి 


ఆత్మకూరు, డిసెంబరు 26: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఘాటుగా స్పందించారు. శనివారం కర్నూలు జిల్లా ఆత్మకూరు మార్కెట్‌యార్డులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు జరుగుతున్నాయని, గోశాలలో గోవులు చనిపోతున్నాయని ఏదిపడితే అది మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీని అభివృద్ధి చేసుకోవాలన్న స్వార్థపూరిత ఆలోచనలతో మల్లికార్జునస్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తన ప్రమేయంతో శ్రీశైలంలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్‌ విసిరారు. 

Updated Date - 2020-12-27T08:34:34+05:30 IST