రాజమండ్రి వైశ్య సేవా సంఘం భూముల్లో ఇళ్ల స్థలాలా?

ABN , First Publish Date - 2020-09-05T09:05:34+05:30 IST

తూర్పు గోదావరి జిల్లా శ్రీ రాజమహేంద్రవర వైశ్య సేవా సాధన సంఘానికి చెందిన 32 ఎకరాల ..

రాజమండ్రి వైశ్య సేవా సంఘం  భూముల్లో ఇళ్ల స్థలాలా?

ఆ 32 ఎకరాలూ తీసుకోవద్దు

అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దు

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అధికారుల యత్నాలపై ఆగ్రహం


అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా శ్రీ రాజమహేంద్రవర వైశ్య సేవా సాధన సంఘానికి చెందిన 32 ఎకరాల భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న అధికారుల ప్రయత్నాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూముల్లో స్థలాలు ఇవ్వరాదని తేల్చిచెప్పింది. అక్కడ ఇళ్ల స్థలాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివి ధ సేవా కార్యక్రమాల కో సం ఉద్దేశించిన సేవా సాఽ దన సంఘానికి చెందిన భూములను ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొంటూ డి.నరసింహారావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.


దీని పై శుక్రవారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఇళ్ల స్థలాల కోసం ఆ భూమిని వినియోగిస్తున్నారని.. అలా కేటాయించరాదని దేవదాయ శాఖ కమిషనర్‌ సైతం గతంలో అధికారులకు లేఖ రాశారని తెలిపారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దరిమిలా ఆ భూముల్లో ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియపై ధర్మాసనం స్టే విధించింది.

Updated Date - 2020-09-05T09:05:34+05:30 IST