గోదావరి ఉగ్రరూపం...ముంపులోనే లంక గ్రామాలు
ABN , First Publish Date - 2020-08-22T12:36:15+05:30 IST
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.
రాజమండ్రి: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 18.30 అడుగులకు పెరిగింది. అధికారులు బ్యారేజీ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి... 19.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గత పది రోజులుగా లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. అనేక లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. నాటు పడవల్లోనే వారి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఓ వైపు ముంపు భయంతో అల్లాడుతున్న బాధితులకు... పునరావాస కేంద్రాల్లో కరోనా భయం వెంటాడుతోంది.