2006తర్వాత గోదావరికి భారీ వరదలు
ABN , First Publish Date - 2020-08-20T14:59:01+05:30 IST
2006 సంవత్సరం తర్వాత మళ్లీ ఈ ఏడాది గోదావరికి భారీ వరదలు వచ్చాయి.

రాజమండ్రి: 2006 సంవత్సరం తర్వాత మళ్లీ ఈ ఏడాది గోదావరికి భారీ వరదలు వచ్చాయి. 2006లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 22.80 అడుగులు నమోదు అయ్యింది. ఈ ఏడాది భారీ వరదల కారణంగా ప్రస్తుతం నీటి మట్టం 19.80 అడుగుల రికార్డును నమోదు చేసింది.
మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 15.50 అడుగులకు తగ్గింది. అధికారులు 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 15.60 లక్షలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.