ఆగస్టులో డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-18T12:35:56+05:30 IST

ఆగస్టులో డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు

ఆగస్టులో డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు

సెప్టెంబరులో ఫలితాలు

రాజమండ్రి: ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో డిగ్రీ విద్యార్థులకు యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి ఆగస్టులో పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఉప కులపతి ఆచార్య ఎం.జగన్నాథరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టులో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.


భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజర్లు, ధర్మల్‌ స్క్రీనింగ్‌ వినియోగిస్తూ విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. సెప్టెంబరులో ఫలితాలు విడుదల చేస్తామన్నారు. రెడ్‌, కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న విద్యార్ధులకు మరోసారి ప్రత్యేక టైం టేబుల్‌ విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టులోనే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్నెట్‌ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉండి ఆన్‌లైన్‌ విద్య అందని విద్యార్థుల సమాచారాన్ని సేకరించా ల్సిందిగా ఆయా కళాశాలలను ఆదేశిస్తామని ఉప కులపతి పేర్కొన్నారు.


Updated Date - 2020-07-18T12:35:56+05:30 IST