కోస్తాలో వర్షాలు

ABN , First Publish Date - 2020-10-07T09:38:18+05:30 IST

వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనానికి

కోస్తాలో వర్షాలు

విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా వుండే ఉపరితల ఆవర్తనం మంగళవారానికి దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల తొమ్మిది నుంచి కోస్తాలో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. కాగా మంగళవారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఎండ తీవ్రత పెరిగి పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరు, తిరుపతిలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Read more