ఉత్తరకోస్తాలో వర్షాలు

ABN , First Publish Date - 2020-05-09T11:54:15+05:30 IST

ఉత్తరకోస్తాలో వర్షాలు

ఉత్తరకోస్తాలో వర్షాలు

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా కర్నాటక వరకు ద్రోణి కొనసాగుతున్నది. మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రత నెలకొంది. వీటికితోడు సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి రావడంతో వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి ఉత్తరకోస్తాలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురిశాయి. ముంచంగిపుట్టులో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రాయలసీమలో 41 నుంచి 44 డిగ్రీలు నమోదు కావచ్చని హెచ్చరించింది. కర్నూలు, అనంతపురంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

Updated Date - 2020-05-09T11:54:15+05:30 IST