కోస్తాలో వర్షాలు

ABN , First Publish Date - 2020-03-08T11:23:48+05:30 IST

దక్షిణ ఉత్తరప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది.

కోస్తాలో వర్షాలు

విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): దక్షిణ ఉత్తరప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. ఎండ తీవ్రతకు సముద్రం నుంచి తేమగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల శనివారం వర్షాలు కురిశాయి. పొదిలి సమీపంలోని అన్నవరంలో ఎనిమిది, చెన్నపాడు, మార్టూరు, పోతవరం, సీతారామపురంలో ఐదు, చీమకుర్తి, చింతకాయలపల్లెలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కర్నూలు, అనంతపురం, తిరుపతిలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2020-03-08T11:23:48+05:30 IST