కోస్తాలో వర్షాలు.. సీమలో పొడిగా..

ABN , First Publish Date - 2020-12-19T07:14:04+05:30 IST

కొమరిన్‌ పరిసరాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి

కోస్తాలో వర్షాలు.. సీమలో పొడిగా..

అమరావతి, విశాఖపట్నం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): కొమరిన్‌ పరిసరాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తూర్పుగాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాలో శుక్రవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, రాయల సీమలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో చలి తగ్గింది. 

Updated Date - 2020-12-19T07:14:04+05:30 IST