కోస్తాలో రేపటి నుంచి వర్షాలు

ABN , First Publish Date - 2020-04-24T08:54:06+05:30 IST

విదర్భ పరిసరాల్లో ఆవరించిన ఉపరిత ఆవర్తనం ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. గురువారం శ్రీకాకుళంజిల్లా బాతుపురంలో 7, కొర్లాంలో 5సెం.మీ. వర్షపాతం...

కోస్తాలో రేపటి నుంచి వర్షాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): విదర్భ పరిసరాల్లో ఆవరించిన ఉపరిత ఆవర్తనం ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. గురువారం శ్రీకాకుళంజిల్లా బాతుపురంలో 7, కొర్లాంలో 5సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయి. 25న కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 26న అనేకచోట్ల వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో 26, 27తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Updated Date - 2020-04-24T08:54:06+05:30 IST