రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ABN , First Publish Date - 2020-06-22T09:29:11+05:30 IST

ఉత్తర ఒడిసా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో రుతుపవనాలు ప్రభావం చూపడంతో

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

  • మొగల్తూరులో గాలికి కూలిన 6 స్తంభాలు

(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌)

ఉత్తర ఒడిసా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో రుతుపవనాలు ప్రభావం చూపడంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. పలుచోట్ల వర్షా లు కురిశాయి. కోస్తా జిల్లాల్లో చాలా వరకు ముసు రు వాతావరణం ఏర్పడింది. పశ్చిమ గోదావరి జి ల్లాలోని భీమవరం, మొగల్తూరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మొగల్తూరు మండలంలో 6 విద్యుత్‌  స్తంభాలు నేలకూలాయి. భీమవరం, కాళ్లలో గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది.


కృష్ణా జిల్లాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మచిలీపట్నంలో ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. గన్నవరంలో 55.5, పెడన 51, గుడివాడ 46, మచిలీపట్నం 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి. రానున్న 24 గం టల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Updated Date - 2020-06-22T09:29:11+05:30 IST