గోదావరికి భారీగా వరద..పూర్తిగా రాకపోకలు బంద్

ABN , First Publish Date - 2020-08-16T14:13:08+05:30 IST

గోదావరికి భారీగా వరద..పూర్తిగా రాకపోకలు బంద్

గోదావరికి భారీగా వరద..పూర్తిగా రాకపోకలు బంద్

పశ్చిమగోదావరి: గోదావరికి వరద భారీగా పెరుగుతుంది.  పోలవరం ప్రాజెక్ట్ కాపర్ డ్యాం వద్ద 28.5 మీ.లకు నీటిమట్టం చేరింది. అలాగే పోలవరం దగ్గర వరద ప్రవాహం 13.83 మీటర్లకు చేరింది. కొత్తూరు కాజ్‌వే పైకి 20 అడుగుల మేర వరద నీరు చేరింది. వరద ప్రభావంతో ఎగువన ఉన్న 19 గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. కుక్కనూరు మండలం దాచారం దగ్గర ఎద్దు వాగు, లోతు వాగు కాజ్‌వేల పైకి వరద నీరు చేరడంతో ఎగువన ఉన్న 16 గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. యలమంచిలి మండలం కనకాయలంక వద్ద కాజ్‌వేపై 6 అడుగుల మేర వశిష్ఠ గోదావరి ప్రవహించడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 

Updated Date - 2020-08-16T14:13:08+05:30 IST