సోషల్ మీడియా పోస్టింగులపై రఘురామ ఘాటు స్పందన..

ABN , First Publish Date - 2020-10-19T17:03:45+05:30 IST

ఏలూరు: తాను కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్‌లపై ఘాటుగా

సోషల్ మీడియా పోస్టింగులపై రఘురామ ఘాటు స్పందన..

ఏలూరు: తాను కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్‌లపై ఘాటుగా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. తనను టీజ్ చేయడానికి, నియోజకవర్గానికి వస్తే.. అరెస్టు చేయించడానికే ఇలాంటి కామెంట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన మీద కామెంట్లు చేస్తున్న వారు.. ఒక పెద్ద మనిషిపై మాత్రం చేయడం లేదన్నారు. తన వ్యక్తిగత అవసరాలకు ఢిల్లీకి తిరుగుతూ... మిగతా సమయాల్లో బయటకు రాని వ్యక్తిపై మాత్రం కామెంట్లు చేయడం లేదన్నారు. కొన్ని మంచి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు.. క్రిస్మస్ ముందుగానే నియోజకవర్గానికి వస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. 


Updated Date - 2020-10-19T17:03:45+05:30 IST