రక్షణ కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరనున్న రఘురామ కృష్ణంరాజు!

ABN , First Publish Date - 2020-06-26T17:17:54+05:30 IST

ఢిల్లీ: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను... హోంశాఖ సెక్రటరీ అజయ్‌భల్లాను కలవనున్నట్టు తెలుస్తోంది.

రక్షణ కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరనున్న రఘురామ కృష్ణంరాజు!

ఢిల్లీ: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను... హోంశాఖ సెక్రటరీ అజయ్‌భల్లాను కలవనున్నట్టు తెలుస్తోంది. తనకు ప్రాణహాని ఉందని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరనున్నట్టు సమాచారం. గతంలో స్పీకర్‌కు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఆ లేఖను స్పీకర్.. హోంశాఖ సెక్రటరీకి పంపారు. అయితే మరోసారి స్పీకర్‌, హోంశాఖ సెక్రటరీని కలిసి.. తన రక్షణ చర్యలపై రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేయనున్నారు. వైసీపీలో క్రమశిక్షణా సంఘం వ్యవహారంపై కూడా ఆయన ఈసీని కలవనున్నట్టు సమాచారం.

Updated Date - 2020-06-26T17:17:54+05:30 IST