ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలకు రఘురామకృష్ణంరాజు ఘాటు రిప్లై

ABN , First Publish Date - 2020-06-15T18:29:24+05:30 IST

ఏలూరు: నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటుగా బదులిచ్చారు.

ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలకు రఘురామకృష్ణంరాజు ఘాటు రిప్లై

ఏలూరు: నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటుగా బదులిచ్చారు. నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎస్సెమ్మెస్ ద్వారా ఆయన సందేశం పంపించారు. ‘‘నాపై వ్యాఖ్యలతో ప్రసాదరాజుకి త్వరలో మంత్రి పదవి వస్తుంది. ఆయనతో ఇలా ఎవరు మాట్లాడించారో నాకు తెలుసు. నేను సీటు అడిగానో లేక బతిమాలితే వచ్చానో ఆయనకు తెలుసు.


నాకు పార్లమెంట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరు ఇచ్చారో కూడా ఆయనకు తెలుసు.. అందరిలాగా ప్రజల మీదపడి డబ్బులు కలెక్ట్ చేయడం నా పద్ధతి కాదు. అటువంటి సొమ్ముతో ఫోటోలు దిగడానికి వెళ్ళలేదు. జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడదామని టైమ్ అడిగితే ఇవ్వలేదు. ఏదేమైనా ప్రసాదరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని రఘురామకృష్ణంరాజు ఎస్సెమ్మెస్‌లో పేర్కొన్నారు.


Updated Date - 2020-06-15T18:29:24+05:30 IST