‘ఆంగ్లమాధ్యమం’లో సర్కారుకు చుక్కెదురే: రఘురామ

ABN , First Publish Date - 2020-10-31T07:43:15+05:30 IST

ఆంగ్లమాధ్యమం కేసులో కచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సుప్రీంకోర్టులో తీర్పు వెలువడుతుందని వైసీపీ నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు అన్నారు.

‘ఆంగ్లమాధ్యమం’లో సర్కారుకు చుక్కెదురే: రఘురామ

న్యూఢిల్లీ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఆంగ్లమాధ్యమం కేసులో కచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సుప్రీంకోర్టులో తీర్పు వెలువడుతుందని  వైసీపీ నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు అన్నారు. మాతృభాషను కాదని ఆంగ్ల మాధ్యమాన్ని నిర్బంధం చేయాలన్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసినా రాష్ట్ర ప్రభుత్వం స్టే కోసం రెండుసార్లు సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. అయినా సుప్రీంలో స్టే ఇవ్వని కారణంగా ఈ విధానాన్ని విరమించుకోవాలని, కోర్టు ధిక్కార నేరానికి పాల్పడవద్దని సీఎం జగన్‌ను కోరారు. కరోనాను లెక్కచేయకుండా నవంబరు 2నుంచి బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం బాధాకరమన్నారు. కొవిడ్‌ కారణంగా స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని చెబుతూ మరోవైపు పాఠశాలలు ఎలా తెరుస్తారని ప్రశ్నించారు. కరోనా నియంత్రణ తర్వాతే పాఽఠశాలలు పునఃప్రారంభించాలన్నారు. 

Read more