వైసీపీ నుంచి నన్ను బహిష్కరించే దమ్ములేక..: రఘురామ

ABN , First Publish Date - 2020-09-17T16:23:31+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైసీపీ నుంచి నన్ను బహిష్కరించే దమ్ములేక..: రఘురామ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరున్నరేళ్లుగా మోదీ అనేక సమస్యలు పరిష్కరించారని కొనియాడారు. వైసీపీ నుంచి తనను బహిష్కరించే దమ్ములేక... పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదని అన్నారు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఎంపీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెడ్డవారిని గుర్తించే శక్తి రావాలని కోరుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు.


Updated Date - 2020-09-17T16:23:31+05:30 IST