ప్రధాని మోదీకి లేఖ రాసిన ఎంపీ రాఘురామ

ABN , First Publish Date - 2020-12-30T19:54:31+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎంపీ రాఘురామ కృష్ణమరాజు లేఖ రాశారు.

ప్రధాని మోదీకి లేఖ రాసిన ఎంపీ రాఘురామ

తూ.గో.జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎంపీ రాఘురామ కృష్ణమరాజు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో 18 నెలల నుంచి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. ఇప్పటి వరకు వంద ఆలయాలపై దాడులు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దుండగులు శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేసి.. తలనరికి ఎత్తుకుపోయారని తెలిపారు. హిందూ ఆలయాలపై దాడుల విషయంలో...కేంద్రం కమిటీని నియమించాలని రఘురామ కృష్ణమరాజు ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-30T19:54:31+05:30 IST