-
-
Home » Andhra Pradesh » raghuram krishna raju comments
-
సొంత పార్టీపై మరోసారి రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-12-19T22:23:27+05:30 IST
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి

ఢిల్లీ: నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు కోసం అక్రమ వసూళ్లు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చిరు వ్యాపారులను పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని చెప్పారు. డబ్బులు లేదా పండ్లు డిమాండ్ చేస్తున్నారన్నారు. అభిమానుల తీరుతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని వెల్లడించారు. అభిమానుల ఉన్మాద చర్యలపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు.