బాహాటంగా రచ్చకెక్కుతారా?

ABN , First Publish Date - 2020-11-26T08:51:51+05:30 IST

కాకినాడలో వైసీపీ సీనియర్‌ నేతల రచ్చ పంచాయితీ.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. డీఆర్‌సీ సమావేశంలో పరస్పరం దూషించుకున్న ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు సీనియర్‌ నేతలేనా? అభిప్రాయ

బాహాటంగా రచ్చకెక్కుతారా?

మీరు సీనియర్‌ నేతలేనా?.. వైవీ, ధర్మానతో చర్చించాలి కదా!

పార్టీ విధానానికి విరుద్ధంగా డీఆర్‌సీ భేటీలో గొడవలా?

బోస్‌, ద్వారంపూడిపై జగన్‌ ఆగ్రహం.. తాడేపల్లిలో ‘కాకినాడ’ పంచాయితీ

ఏమిటీ రచ్చ

మీరు సీనియర్‌ నేతలేనా?.. వైవీ, ధర్మానతో చర్చించాలి కదా!

పార్టీ విధానానికి విరుద్ధంగా డీఆర్‌సీ భేటీలో గొడవలా?

ఇంకోసారి జరిగితే ఉపేక్షించను

బోస్‌, ద్వారంపూడిపై జగన్‌ ఆగ్రహం


అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో వైసీపీ సీనియర్‌ నేతల రచ్చ పంచాయితీ.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. డీఆర్‌సీ సమావేశంలో పరస్పరం దూషించుకున్న ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు సీనియర్‌ నేతలేనా? అభిప్రాయ భేదాలుంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి. పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డితో,  జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదా్‌సతోనూ చర్చించాలి. వాళ్లతో మాట్లాడకుండా బాహాటంగా రచ్చకెక్కుతారా? డీఆర్సీ సమావేశంలోనే పార్టీ విధానానికి విరుద్ధంగా మాట్లాడతారా? ఇలా మరోసారి జరిగితే ఉపేక్షించేది లేదు’  అని తేల్చిచెప్పారు. వీరిద్దరి మధ్య వివాదం రాష్ట్రంలో వైసీపీ అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖ డీఆర్‌సీ సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పార్టీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్‌ మాటల దాడి వ్యవహారం కూడా సంచలనం సృష్టించడంతో ఆ ముగ్గురినీ క్యాంపు కార్యాలయానికి సీఎం పిలిపించి.. సర్దుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో బోస్‌, ద్వారంపూడితో పాటు సుబ్బారెడ్డి, కృష్ణదా్‌సలనూ ఆయన బుధవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు. తొలుత పార్టీ సమన్వయకర్త వైవీతో మాట్లాడి అభిప్రాయం తెలుసుకున్నారు. అనంతరం కృష్ణదాస్‌ అభిప్రాయాన్నీ తీసుకున్నారు. తన వద్ద ఉన్న సమాచారంతో బేరీజు వేసుకున్నారు. అనంతరం నలుగురితోనూ సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. బోస్‌, చంద్రశేఖర్‌రెడ్డిల వాదన కూడా సీఎం ఆలకించారు. ‘అన్నా నువ్వలా అని ఉండాల్సింది కాదు. సీనియర్‌ నేతలే బాహాటంగా మాట్లాడితే ఎలా’ అని బోస్‌నుద్దేశించి జగన్‌ అన్నట్లు తెలిసింది. ఇలా మరోసారి జరిగితే ఉపేక్షించేది లేదని.. తనకు పార్టీ ముఖ్యమని ఇద్దరికీ స్పష్టం చేశారు. బహిరంగ వేదికలపై పరస్పర విమర్శలొద్దన్నారు: బోస్‌పార్టీ నేతలెవరూ పరస్పరం బహిరంగ వేదికలపై విమర్శలు చేసుకోవద్దని సీఎం సూచించారని బోస్‌ ఆ తర్వాత తెలిపారు. కాకినాడ మేడలైన్‌ వంతెన వ్యవహారంపై తనను, ద్వారంపూడిని కూర్చొబెట్టి జగన్‌ మాట్లాడారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ వంతెన విషయంలో అవినీతి జరిగిందని.. తన అభ్యంతరాలను  పరిశీలించేందుకు  టెక్నికల్‌ రిపోర్టు తెప్పించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. కాకినాడ డీఆర్‌సీ భేటీలో జరిగిన గొడవ టీ కప్పులో తుఫాను లాంటిదన్నారు. ఆవేశంలో ఇలాంటి వివాదాలు సహజమేనన్నారు. ఇంకోవైపు.. శిరోముండనం కేసు ఈనాటిది కాదని.. సీఎం వద్ద ఈ అంశం ప్రస్తావనకు రాలేదని బోస్‌ చెప్పారు. 22 ఏళ్లుగా తానీ అంశంపై పోరాటం చేస్తూనే ఉన్నానని చెప్పారు. 

Updated Date - 2020-11-26T08:51:51+05:30 IST