కరోనా అంటకుండా రాజ్ ట్రస్ట్ వినూత్న కార్యక్రమం
ABN , First Publish Date - 2020-04-05T16:44:16+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రైతుబజార్‌కు వచ్చే ప్రజలకు కరోనా అంటకుండా

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రైతుబజార్‌కు వచ్చే ప్రజలకు కరోనా అంటకుండా రాజ్ ట్రస్ట్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. హైస్కూల్ గ్రౌండ్‌లో ఉన్న రైతు బజార్‌కు వచ్చే ప్రజలకు సోడియం హైడ్రో క్లోరైడ్ మిశ్రమంతో కూడిన నీటిని స్ప్రే చేసే టన్నెల్ ఏర్పాటు చేసింది. రైతుబజార్‌కు వచ్చే ప్రజలంతా టన్నెల్‌లోకి వెళ్లి వస్తున్నారు. ఇప్పటికే భీమవరం పట్టణ వీధుల్లో కొద్దిరోజులుగా ప్రత్యేక మిషన్లతో రాజ్ ట్రస్ట్ స్ప్రే చేస్తోంది. ఈ ట్రస్ట్ చేస్తున్న మంచి పనిని జనాలు, ప్రముఖులు మెచ్చుకుంటున్నారు.