కౌలు రైతులకు త్వరితగతిన కార్డులు: సీసీఎల్‌ఏ

ABN , First Publish Date - 2020-05-17T10:57:08+05:30 IST

రాష్ట్రంలోని కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డు (సీసీఆర్‌)ల జారీని వేగవంతం చేయాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ ..

కౌలు రైతులకు త్వరితగతిన కార్డులు: సీసీఎల్‌ఏ

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డు (సీసీఆర్‌)ల జారీని వేగవంతం చేయాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ వలంటీర్లు, వీఆర్వోల సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ శనివారం లేఖలు రాశారు. ఇప్పటిదాకా కేవలం 2,72,470 మందికే కార్డులు జారీ చేశామని, మరింత పురోగతి కనబర్చాలని కలెక్టర్లను కోరారు. కౌలుదారులకు కార్డులు ఇచ్చేందుకు యజమానులను వీఆర్‌ఓలు ఒప్పించాలని సూచించారు.

Updated Date - 2020-05-17T10:57:08+05:30 IST